
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వానలకు గ్రామాల్లోని చెరువులు నిండి, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగు పొంగిపొర్లుతోంది.. రోడ్డుపై వాగు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. ఫరూక్ నగర్ లోని బొబ్బిలి చెరువు నిండి అలుగు పారుతుంది. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామ వాగు ఉదృతంగా పారుతుంది. ప్రయాణికులు ప్రమాదభరితంగా సాగుతున్న వాగులు ధాటోద్దని , చేపల వేటకు, ఈతలకు పిల్లలను వెళ్ళనివ్వకుండా చూడాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు.