
దీక్షా శిభిరం నుంచి కిషన్ రెడ్డిని అరెస్టు చేస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆయన గాయపడ్డారు. కాలు, చేతికి గాయాలయ్యాయి. అయినా పోలీసులు ఆయనను పార్టీ కార్యాలయానికి తరలించారు. కిషన్ రెడ్డి తన దీక్షను అక్కడే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కిషన్ రెడ్డిని అరెస్టు చేస్తున్న సమయంలో కార్యకర్తలు ఆయన వాహనంపైకి ఎక్కి మరీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు బలవంతంగా వారిని దింపివేశారు. కాగా, పార్టీ ఆఫీసులో పోలీసులు కిషన్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు.