
దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలించడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఛాతీలో గాయమవడంతోపాటుగా.. చేతులపై, ఛాతీపై, ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గీరుకుపోయాయి.
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు గోళ్లు గీరుకుపోయిన చోట్ల ఆయింట్మెంట్ ఇవ్వడంతోపాటుగా.. ఛాతీలో అయిన గాయానికి రేపు ఉదయం ఎక్స్రే తీసుకోవాలని సూచించారు.
ఇతర పారామీటర్లు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.