
TS TET ప్రెస్ నోట్ విడుదల చేసిన టెట్ కన్వీనర్ రాధారెడ్డి
TS-TET మొత్తం 33 జిల్లాల్లో నిర్వహిస్తున్నాం
రెండు సెషన్లలో టెట్
పేపర్-I ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు.
పేపర్-II మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం వరకు 5:00
రాష్ట్రంలోని 2052 కేంద్రాల్లో టెట్ పరీక్ష
4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు
పేపర్-1 రెండు లక్షల 69 వేల 557 మంది పేపర్-II రెండు లక్షల 84 వేల 98 మంది అభ్యర్థులు రాయనున్నారు
టెట్ నిర్వహణ కోసం2 వేల 52 మంది చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు
2052 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల నియామకం
టెట్ నిర్వహణకు 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు
చీఫ్ సూపరింటెండెంట్ గదిలో CCTV కెమెరాలు ఏర్పాటు
పరీక్షా కేంద్రాలలో ANM ల తో పాటు ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అదేశాలు జారీ
టెట్ నిర్వహణకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల తో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు
టెట్ అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులుపేరులో అక్షర దోషాలు చూసుకోవాలి
ఒక వేళ ఏమైనా తప్పులు ఉంటే.. పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకునే అవకాశం
హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. లేకపోతే అభ్యర్థుల తాజా ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. గెజిటెడ్ అటెస్టేషన్ ఉంటేనే పరీక్ష హాల్లోకి అనుమతి
గంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
టెట్ లో ఒక్క నిమిషం నిబంధన కఠినంగా అమలు చేయనున్న అధికారులు
పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను..అభ్యర్థులనుఅనుమతించరు.
రెండు సేషన్ల పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు.
ఒక వేళ అభ్యర్థులు ఎవరైనా ముందుగానే బయటకు వస్తే.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు
ఎలక్ట్రానిక్ పరికరాలు..రిమోట్ తో కూడిన కారు తాళాలు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకూడదు.
ఓఎంఆర్ షీట్లో బ్లూ..బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుంది.
హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదు.
పరీక్ష రాసే ముందు OMR ఆన్సర్ షీట్ సైడ్‌లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి అనుసరించాలి.
మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రం మీరు ఎంచుకున్న భాషలో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలా లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్ చెప్పాలన్న అధికారులు