
‘‘అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా,
న్యాయం కనుచూపు మేరలో కనిపించనపుడు
కత్తి చేతబూనడమే సరైనద పద్ధతి
అపుడు అది పోరాడే హక్కుగా మారుతుంది”
…అని గురుగోబింద్ సింగ్, ఔరంగజేబుతో సంభాషణలు జరుపిన మాటలను తన జఫర్‌నామాలో రాసుకున్నారు. ఆ మాటలను చంద్రబాబు లాయర్ సిద్దార్థ్ లూథ్రా తన ట్వీట్ కోట్ చేశారు.
ఇపుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆయన ట్వీట్‌కు స్పందిస్తూ ‘మీరే గెలుస్తారంటూ’ విషెస్ చెబుతుంటే మరికొందరు కోర్టులో న్యాయం జరగనపుడు ఇలా హింసను ప్రేరేపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో అనేక మంది అనేక అంశాల్లో కోర్టుల్లో ఓడిపోతుంటారనీ, న్యాయం జరగలేదని ఆయుధం చేతబూనితే నక్సలైట్లే కరెక్ట్ అవుతారని కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాఖ్యానాలు చేస్తున్నారు.