
ఈనెల 17 న తుక్కుగూడ లో నిర్వహించనున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మీటింగ్ కు సంభందించి కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ బుధవారం సిర్పూర్ టీ మండలం వేంపల్లి లోని పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన కార్యకర్తల నాయకుల సమావేశం రెండు వర్గాల నాయకుల మధ్య పోటాపోటీ నినాదాలతో ,అరుపులు కేకలతో రసాభాసగా మారింది. మీటింగ్ నిర్వహించే చోటుకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకుడు రావి శ్రీనివాస్ తన వర్గీయులతో నినాదాలు చేస్తూ చేరుకున్నాడు. ఓ దశలో మీటింగ్ వద్ద ఉన్న కృష్ణారెడ్డి వర్గం కు వ్యతిరేకంగా రావి శ్రీనివాస్ వర్గీయులు స్థానికులకే టికెట్ ఇవ్వాలని, నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. పలుమార్లు ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ సముదాయించినా వినని కార్యకర్తలు. చివరకు తను సోనియా గాంధీ మీటింగ్ విజయవంతం కోసం మాత్రమే వచ్చానని, టికెట్ కేటాయింపు విషయం తనకు సంబంధం లేదని చెప్పడంతో కార్యకర్తలు, నాయకులు శాంతించారు.