
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్..
పీహెచడీ అడ్మిషన్లను అర్హులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు.
మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేశారు.
అర్హత లేని బీఆర్ఎస్ అనుబంధ సంఘాల విద్యార్థులకు సీట్లు ఇచ్చారు.
ఉస్మానియా తర్వాత అతి పెద్దది కాకతీయ యూనివర్సిటీ.
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కేయూ ముందుండి నడిచింది.
కేసిఆర్ కుటుంబ పదవులు యూనివర్సిటీ విద్యార్థుల బిక్ష.
వీసీ, రిజిస్ట్రార్ లపై చర్యలకు ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది.
రాజకీయ పార్టీకి బంట్రోతు లాంటి వ్యక్తిని వీసీ ని చేశారు.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిని రిజిస్ట్రార్ గ ఎందుకు నియమించారో తెలియాలి.
టాస్క్ ఫోర్స్ పోలీసులతో విద్యార్థులను కొట్టించిన ఘటనను తెలంగాణ ప్రజలు ఖండించాలి.
వీసీ, రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేయాలి.
తప్పు చేస్తే సరిదిద్దాలి గానీ, రౌడీలలాగా కళ్ళు చేతులు విరగ్గొడతారా.
ప్రైవేట్ యూనివర్శిటీలు నడుపుతున్న పల్లా కేయూ అక్రమాలకు బాధ్యత వహించాలి.
ఎమ్మెల్సీ పల్లా కేయూ మూసివేతకు కుట్ర పన్నుతున్నాడు.
కేయూ విద్యార్థులకు అండగా కాంగ్రెస్ ఉంటుంది.
మీ పోరాటం కొనసాగించండి.
100 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
వీసీ, రిజిస్ట్రార్ ల అక్రమాలపై విచారణ జరిపిస్తాం.
విద్యార్థులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం: రేవంత్ రెడ్డి
విద్యార్థుల బిక్షతో అధికారంలోకి వచ్చిన కేసిఆర్ కు సీఎం పదవి అర్హత లేదు.