
ఇటీవల కురిసన వర్షానికి ఏర్పడ్డ పాట్ హోల్స్ ఓ చిన్నారిని బలిదీసుకున్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న దీక్షిత ఉదయం తన తండ్రి కిషోర్‌తో కలిసి స్కూల్‌కు వెళ్తోంది. టూ వీలర్ వెనక కూర్చున్న దీక్షిత గుంతల మయమైన రోడ్డుపై ఒక చోట ఎగిరి కింద పడింది. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న ఒక స్కూల్ బస్సు పాపపై నుంచి వెళ్లింది. దాంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. దీక్షిత మరణాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వాళ్లను చూసి ఆ దారి గుండా వెళ్తే వాహనదారులు కంట తడి పెట్టారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. వర్షాలకు సిటీలో 25 వేల పాట్ హోల్స్ ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటిని ఎప్పటికి పూడుస్తారో తెలియని పరిస్థితి ఉంది.