
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దేవుడే దిక్కయ్యాడు. ఆయనే అన్నం పెడుతున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం లేదు. దాంతో వాళ్లు గాంధీనగర్‌లోని వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమంలో ఆరు రోజులుగా భోజనం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో వారం రోజుల నుండి వాళ్లు సమ్మెకు దిగారు. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకపోవడంతో వాళ్లకు గణేశుడే దిక్కయ్యారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆకలి తీర్చుకుంటున్నారు.
నవరాత్రి ఉత్సవాలు నేటితో మూగియడంతో రేపటి నుండి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిడ్ డే మీల్స్‌కు ఆటంకం కలగకుండా చూడాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు.