వేకువ వేళల్లో (early morning) వాకింగ్ చేస్తున్నారా? అలా చేసే వాళ్లు తప్పకుండా కొన్ని రిస్కుల బారిన పడతారంటున్నారు డాక్టర్లు. వేకువ వేళల్లో వాతావరణంలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆ టైంలో గాలి కూడా ఎక్కువగా ఉండదు. దీంతో కాలుష్యపదార్థాలు వాతావరణంలో కేంద్రీకృతమై ఉంటాయి. దానివల్ల వేకువ వేళల్లో నడిచేవాళ్లు తీవ్రమైన తలనొప్పి, అలసట, తలతిరిగినట్టు ఉండడం వంటి సమస్యల బారిన పడతారు. కాలుష్యాల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల వాకర్స్ ఊపిరితిత్తుల కాన్సర్ బారిన పడే అవకాశం కూడా బాగా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

తరచూ దగ్గు, చాతీ నొప్పి సమస్యల బారినపడేవారు వేకువ వేళల్లో వాకింగ్ చేయకుండా ఉంటేనేమంచిదని కూడా సూచిస్తున్నారు. ఎలర్జీలతో బాధపడేవాళ్లు ఉదయం వాకింగ్ చేసేటప్పుడు పుప్పొడి వంటి పలు ఎలర్జెంట్స్ బారిన పడే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వీటివల్ల వాకర్స్ లో రకరకాల ఎలర్జీలతో పాటు ఆస్తమా వంటివి రేకెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లకు మార్కింగ్ వాక్ అస్సలు మంచిది కాదు. వేడి వాతావరణం ఉన్న సీజన్లలో ఉదయం వేళల్లో నడవడం వల్ల డీహైడ్రరేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే అలాంటి వాతావరణంలో వాకింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిల్ తీసుకొని వెళ్లాలి. వాకింగ్ మధ్యలో తరచూ మంచినీటిని సిప్ చేస్తుండాలి.

ఉదయం వేళల్లో వాతావరణంలో ఉన్న కాలుష్యం వల్ల ముక్కు, గొంతు మూసుకుపోయి కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే సైనసైటిస్, దగ్గు ఉన్నవాళ్లు కూడా వేకువ వేళల్లో వాకింగ్ అస్సలు చేయొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇవి క్రానిక్ ఊపిరితిత్తులు, కార్డియాక్ డిజార్డర్లతో ముడిపడి ఉంటాయని కూడా చెప్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయాల్లో యాక్సిడెంట్ల రిస్కు కూడా ఎక్కువే. పైగా తెల్లారుజామున వాకింగ్ చేసే సమయాల్లో దోమలు, తేనెటీగలు వంటి వాటి బారిన వాకర్స్ పడే అవకాశంఎక్కువగా ఉంటుంది. వాకర్స్ ఈ రిస్కును అధిగమించడానికి ఇన్సెక్ట్ రెపలెంట్స్, రీరానికి ప్రొటెక్టివ్ గా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఉదయం నిద్ర లేచిన వెంటనే నేరుగా వాకింగ్ కి వెళ్లిపోవద్దంటున్నారు వైద్యులు. ఆ టైంలో శరీరం మొత్తం రెస్టింగ్ మోడ్ లో ఉంటుంది. అందుకే శరీరం వెంటనే వార్మ్ అప్ అవలేదు. ఇలా చేస్తే కండరాలు అలసినట్టు అయిపోవడంతో పాటు కొన్నిసార్లు కండరాలు గాయలపాలవుతాయి కూడా. మార్కింగ్ వాక్ చేసేవాళ్లల్లో అందులోనూ వ్యాయామాలు అలవాటు లేనివాళ్లు అధిక శ్రమకు గురవుతారు. ఇది వారికి తీవ్ర అలసటను కలుగజేస్తుంది. కండరాలు నొప్పి పెడతాయి. గుండె సమస్యలకు ఇది దారితీస్తుంది. అందుకే ఉదయం వేళల్లో నడిచేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారు.