
తెలంగాణా రాష్ట్రం లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కదానికే ఏ గ్రేడ్ తో కూడిన ఐకార్ గుర్తింపు ఉందని ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య స్పష్టం చేశారు.
విద్యార్థులు, తల్లితండ్రుల ప్రయోజనార్ధం ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపులేని ప్రైవేటు కళాశాలలతో PJTAUకు ఎలాంటి సంబధం లేదని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం లో సీట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకునే దళారుల మాటలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోవద్దని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలతో విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం, భాగస్వామ్యం లేదని వివరించారు. ప్రవేశాల సమయం లో అప్రమత్తం గా ఉండాలని విద్యార్థులు, తల్లితండ్రులకి ఆయన సూచించారు.
ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రత్యేక కోటాలో ఫీజులు భారీగా తగ్గించడమే కాకుండా… సీట్లు కూడా పెంచామని.. పెంచిన సీట్లను కౌన్సెలింగ్ ద్వారా ప్రతిభ ఆధారం గానే PJTAU రెగ్యులర్, ప్రత్యేక కోటాలో ప్రవేశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎటువంటి మధ్య దళారీలు, కన్సల్టెంట్ ల పైన ఆధార పడవద్దని, వారి మాయ మాటలని నమ్మ వద్దని ఉపకులపతి మరోసారి సూచించారు.
ఇతర అనధికారిక వెబ్ సైట్ లలో లభ్యం అయ్యే సమాచారానికి విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని తెలిపారు. పెంచిన ప్రత్యేక కోటాసీట్ల భర్తీ కోసం ప్రస్తుతం ఆన్లైన్ లో దరఖాస్తులు నవంబర్1 వ తేదీ వరకు స్వీకరిస్తున్నామని.. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రవేశాలకి సంబంధించిన సమాచారం కొరకు తల్లితండ్రులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్ *www.pjtsau.edu.in* మాత్రమే చూడవలసింది గా ఉప కులపతి జానయ్య సూచించారు.