
కట్టుకున్న భర్తను చంపేసింది. ఆ శవం పక్కనే ఒంటరిగా కూర్చుని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసింది. ఈ సంచలన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన శివనాగరాజు, లక్ష్మీమాధురి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం ఈ కుటుంబం విజయవాడకు వెళ్లింది. అక్కడ సినిమా టాకీస్‌లో లక్ష్మీ మాధురి పని చేసింది. అప్పుడు సత్తెనపల్లికి చెందిన గోపితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.
భర్త చేస్తున్న ఉల్లిపాయల వ్యాపరం లక్ష్మీ మాధురి నామోషీగా భావించించి. భర్తను హైదరాబాద్‌లో ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్న గోపీ దగ్గరకు పంపింది. శివనాగరాజును డ్రైవింగ్‌కు పంపించి మాధురితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు గోపి. విషయం తెలుసుకున్న శివనాగరాజు తన భార్యను తీసుకుని చిలువూరులో ఉంటున్న తన తండ్రి లోకం గాంధీ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ కూడా గోపీతో తన బంధాన్ని కొనసాగించింది మాధురి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తనకు అడ్డుపడుతున్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలనుకుంది మాధురి.
గోపితో నిద్రమాత్రలు తెప్పించింది. 18వ తేదీ రాత్రి స్వయంగా బిర్యానీ వండింది. అందులో ఇరవై నిద్రమాత్రలు కలిపి భర్తకు తినిపించింది. భర్త నిద్రపోయిన తర్వాత గోపీని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు కలిసి శివనాగరాజు ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. హత్య తర్వాత భర్త శవం పక్కనే కూర్చుని రాత్రంతా సెల్ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది మాధురి. తెల్లారిన తర్వాత శివనాగరాజు గుండెపోటుతో చనిపోయినట్టు మాధురి చెప్పింది. అయితే మృతుడి తండ్రికి అనుమానం రావడంతో పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మీమాధురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మాధురి, గోపి చేసిన నేరం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న గోపీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.