
కాసేపు మంచి కునుకు తీయాలనుకుంటున్నారా…? అయితే కాఫీ తాగండి. అదేమిటి కాఫీ తాగితే నిద్ర రాదు కదా అనే అనుమానం మీకు వచ్చింది కదూ. కానీ నిద్ర పట్టే విషయంలో ఈ టిప్ కాస్త డిఫరెంట్ మాత్రమే కాదు మరెంతో పవర్ ఫుల్ కూడా. విశ్రాంతితో కూడిన ఒక కునుకు తీయడానికి జపాన్ దేశీయులు చాలామంది ఈ టిప్పును బాగా ఫాలో అవుతారట. అందుకే కాసేపు నిద్రపోవాలనుకున్నప్పుడు 200 మిల్లీగ్రాముల కాఫీ తాగి 20 నిమిషాలు నిద్ర లేదా రెస్టు తీసుకోండి. ఇలా చేస్తే ఆ ఎఫెక్టే వేరుగా ఉంటుందిట. మంచి నిద్ర పడుతుందిట. కాఫీ తాగడం వల్ల అందులోని కెఫైన్ మీకు కిక్ ఇవ్వడమే కాకుండా మనల్ని ఎంతో అలెర్టుగా ఉంచే బ్రెయిన్ లోని అడెనొసైన్ అనే మాలిక్యూల్ ని బయటకు పోగొడుతుందిట. ఎప్పుడైతే బ్రెయిన్ లో అడెనొసైన్ ప్రమాణాలు పెరిగుతాయో అప్పుడు మనం బాగా అలసిపోయినట్టవుతాం. అలాంటి సమయంలో ఒక కాఫీ తాగి కునుకు తీస్తే బ్రెయిన్ లోని అడెనొసైన్ పూర్తిగా బయటకుపోతుందిట. కాఫీ ప్రభావంతో ఆ మాలిక్యూల్ పూర్తిగా అచేతనం అవడంతో మనం మంచి కునుకు తీయగలమట. అదీ సంగతండి. మరి మీరూ దీన్ని ప్రయత్నించి చూడండి.