
రోజుకు రెండు గుడ్లు తింటే మీ శరీరం ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది. గుడ్లల్లోని ఎసెన్షియల్ న్యూట్రియంట్లు శరీరానికి ఎన్నో మేళ్లు చేస్తాయట. అవి మనకు అందించే ఎనర్జీ కూడా ఎంతోనట. ఇంతకూ రోజుకు రెండు గుడ్లు తింటే వచ్చే లాభాల జాబితా చాలా పెద్దదే ఉందంటున్నారు వైద్యులు, పోషకాహారనిపుణులు కూడా. పోషకాహార నిధి అయిన గుడ్లను రోజుకు రెండు తింటే అధికప్రమాణాలతో కూడిన ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. ఇవి కండరాలను పటిష్టంచేస్తాయి. ఎదుగుదల బాగా కనిపిస్తుంది. అంతేకాదు శరీరం పనితీరు కూడా ఎంతో బాగా ఉంటుంది. గుడ్లల్లో విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ , ఇ , ఇంకా రకరకాల బి విటమిన్లు అంటే బి12, ఫోలేట్ వంటివి కూడా గుడ్లల్లో సమృద్ధిగా ఉన్నాయి. ఐరన్, జింక్, సెలెనియం వంటి ఖనిజాలు కూడా గుడ్లల్లో ఎక్కువే. కండరాల బలానికి కావలసిన ప్రొటీన్లు గుడ్లు ఇస్తాయి.
రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల 12 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. ఇవి కండరాల వృద్ధికి సైతం సహకరిస్తాయి. దెబ్బతిన్న టిష్యులను బాగుచేస్తాయి. కండరాలను దృఢంగా ఉంచుతాయి. ఇంకా నిత్యం మీ డైట్ లో గుడ్లను చేర్చడం వల్ల వెయిట్ మేనేజ్ మెంట్ కు కూడా ఎంతో తోడ్పడుతుందని పోషకాహారనిపుణులు చెప్తున్నారు. కారణం గుడ్డులోని హెల్తీ ఫ్యాట్లు, ప్రొటీన్ల వల్ల కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు.ఫలితంగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ జోలికి పోరు. దీంతో లావు కారు. బరువు పెరగరు. కంటి ఆరోగ్యానికి కూడా గుడ్డు చేసే మేలు ఎంతో. గుడ్లల్లోని ల్యుటిన్, జెక్సానితిన్ వంటి యాంటాక్సిడెంట్లు కళ్లను ఎంతగానో సంరక్షిస్తాయి. ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను సంరక్షిస్తాయి. వయసుతో వచ్చే శుక్లాలు, మస్క్యులర్ డీజనరేషన్ వంటి సమస్యల రిస్కు కూడా గుడ్లు నిత్యం తినడం వల్ల తొందరగా తలెత్తదు.
మెదడు పెరుగుదలను, పనితీరును సయితం మెరుగుపరచడంలో గుడ్డు కీలకంగా పనిచేస్తుంది. జ్ఝాపకశక్తి, మూడ్స్ క్రమబద్ధీకరించడంలో, తెలివితేటల పెంపుదలలో గుడ్డు పోషించే పాత్ర ఎంతో. రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల ఖొలైన్ పెరుగుతుంది. ఫలితంగా బ్రెయిన్ ఆరోగ్యం బాగా ఉంటుంది. పరిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా గుడ్డు మంచే చేస్తుందని అధ్యయనాలు సైతం చెప్తున్నాయి. గుడ్డులో ఒమేగా3ఫ్యాటీ యాసిడ్స్ వంటి హెల్దీ ఫ్యాట్లు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు ఎక్కువగా ఉండే గుడ్ల శరీరానికి నాణ్యమైన పోషకాలను అధికంగా అందిస్తాయి. దీంతో శరీరం ఎంతో ఎనర్జిటిక్ గా, మరింత ఆరోగ్యంగా తయారవుతుంది. సో…రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి . కాబట్టి మీ వయసు, ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుల సూచనలకుగుణంగా గుడ్డును మీ డైట్ లో నిత్యం ఉండేలా చూసుకోవడం మరవొద్దు.