రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగళా ఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వానలు పడనున్నాయి. హైదబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, యదాద్రి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది.