హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన యాక్సిడెంట్లో ఓ యువతి అక్కడికక్కడ మృతి చెందింది. గురువారం తెల్లవారు జామున జరిగిన యాక్సిడెంట్లో స్వీటీ పాండే అనే 22 ఏళ్ల యువతి టూ వీలర్ మీది నుంచి ఎగిరిపడింది. ఫ్లై ఓవర్ మీది నుంచి కింద రోడ్డుపై పడి మృతి చెందింది. కోల్‌కత్తాకు చెందిన స్వీటీ కవాడిగూడలో ఉంటుంది. సిటీలో ఆమె ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. యాక్సిడెంట్ సమయంలో ఆయన తన స్నేహితుడు రేయన్ లూక్‌తో కలిసి జెఎన్టీయు నుంచి ఐకియా వైపుగా ప్రయాణిస్తున్నారు. రేయన్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 304ఏ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.