
మనం పెరుగు అని పిలుచుకునే ఐటమ్‌ను ఇంగ్లీష్‌కు వచ్చే సరికి కర్డ్ అనాలా? యోగర్ట్ అనాలా? అనే అనుమానం వస్తుంది. మన ఇండియన్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు కర్డ్ కావాలి అనే వాళ్లు అమెరికా పోయి వచ్చే సరికి యోగర్ట్ ఉందా అనేటప్పటికి మనలో కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. కర్డ్ అన్నా, యోగర్ట్ అన్నా ఒకటేనా? రెండు వేర్వేరా అనే డౌట్ అట్లాగే ఉన్నా చాలా మంది రెండు ఒక్కటేలే అని సరిపుచ్చుకుంటారు. కానీ ఈ రెండు వేరు. రెండూ పాలతో తయారయ్యే పదార్థాలే అయినా ప్రిపరేషన్ డిఫెరెంట్‌గా ఉంటుంది.
ఇండియన్ డిష్‌లో పెరుగు లేకుండా మనం ఊహించుకోలేం. సాధారణంగా ఇండియాలో పెరుగు లేదా కర్డ్ని పాలల్లో పాత పెరుగును వేసి తోడు పెడతాం. పాత పెరుగు లేనపుడు చింతపండు, నిమ్మరసం వేసి తోడు పెడతారు. ఇలా పాలల్లో తోడు వేసి తయారుచేయడాన్ని కర్డ్ అంటారు. ఇందులో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది.
మరి యోగర్ట్ ఎలా తయారవుతుంది?
ఆర్టిఫీషియల్ యాసిడ్స్ ఉపయోగించి పాలను ఫర్మెంట్ (పులియబెట్టడం) చేసే విధానం ద్వారా తయారుచేసే పదార్ధాన్ని యోగర్ట్ అంటాం. దీనికి ఒక ప్రత్యేక టెంపరేచర్ అవసరమవుతుంది. కమర్షియల్‌గా పెరుగును భారీ స్థాయిలో తయారు చేయాలనుకున్నపుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
కర్డ్ లేదా యోగర్ట్ .. రెండూ చూడడానికి ఒకే తీరులో ఉంటాయి. కానీ వాటి రుచిలో ఎంతో తేడా ఉంటుంది. రెండింట్లోనూ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కర్డ్‌లో కన్నా యోగర్ట్‌లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం యోగర్ట్‌ను ఫర్మెంటేషన్ చేసే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. కర్డ్‌లో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా తక్కువగా ఉంటుంది. అయితే ఆ బ్యాక్టీరియా అంతా ఒకే రకమైన కుటుంబానికి చెందినవై వుండవు. కానీ యోగర్ట్‌లో ఒక కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా ఉంటుంది.
కర్డ్‌లో లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా లేదా ల్యాక్టోబాసిల్లస్ కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా ఉంటుంది. యోగర్ట్‌లో ఈ కుటుంబంలోని ఏదో ఒక బ్యాక్టిరియా మాత్రమే ఉంటుంది. కర్డ్‌లో మిల్క్ ఫ్యాట్స్, ప్రొటీన్, క్యాల్షియం, ఫాస్పరస్ లాంటి సహజ సిద్ధ మిశ్రమాలు ఉంటాయి. ఇవి ఎముకలు, పళ్ల గట్టిదనానికి, ఇమ్యూనిటీ పెంచేందుకు తోడ్పడతాయి. యోగర్ట్‌లో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో రకరకాల రూపాల్లో తయారవుతాయి. కొన్ని రకాల యోగర్ట్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండొచ్చు. ఫలనా విటమిన్ మీకు ఎక్కువ అవసరం అయితే అది ఎక్కువ మోతాదులో ఉన్న యోగర్ట్స్ అందుబాబులో ఉంటాయి.
ఏది మంచిది..
ఇదంతా చదివాకా మీకే అర్థమై ఉంటుంది. కర్డ్, యోగర్ట్ రెండూ మంచివే. ఒకటి ఇంట్లోనే తయారు చేసుకుంటాం. బయట తయారైన కర్డ్ కొంటే దాన్నెలా తయారుచేశారు అనే దానిపై అది కర్డ్నా, యోగర్ట్నా అని డిసైడ్ చేసుకోవాలి. యోగర్ట్ కమర్షియల్‌గా ఆర్టిఫిషల్ యాసిడ్స్‌తో ఉత్పత్తి అయ్యే డిజైనర్ పెరుగు అన్న మాట. ప్రతీ మీల్లో ఏదో ఒకరకమైన పెరుగు ఉండడం మంచిది. ఇక పెరుగు ఎప్పుడు తినకూడదో మీకేదైనా అనారోగ్యం చేసినపుడు డాక్టర్ మీకు చెబుతారు. ఈలోపు దేన్ని కర్డ్ అనాలో, దేన్ని యోగర్ట్ అనాలో మీరే డిసైడ్ చేసుకోండి.