
కాంగ్రెస్ టికెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందేనని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు టికెట్ కావాలన్నా దరఖాస్తు చేసుకోవాల్సిందేనన్నారు. దరఖాస్తు చేసుకున్నాక అభ్యర్థి పరిస్థితిపై నియోజక వర్గాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తామన్నారు. ఆ రిజల్ట్‌ను బట్టి టికెట్లు కేటాయించడం జరుగుతుందని రేవంత్ తెలిపారు.
దరఖాస్తుకు ఓ రేటు
దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు నిర్ణీత ఫీజు చెల్లించాలి. టికెట్ రాకపోతే పైసలు వెనక్కి రావు. నాన్ రిఫండెబుల్ ఫీజు ఇది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25 వేల రూపాయలు, బీసీ, ఓసీలకు 50 వేలు ఫీజుగా నిర్ణయించారు. అప్లికేషన్లు ఇచ్చేందుకు 18 నుంచి 25 వరకు గడువు నిర్ణయించారు. ఆశావహులు ఎవరైనా ఉంటే ఇక తొందరపడాల్సిందే.