
చేప మందు ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ (84) అనారోగ్యంతో హైదరాబాద్ బొలక్ పూర్ పద్మశాలి కాలనీలో ఆయన నివాసంలో కన్ను మూశారు.
బత్తిని హరినాథ్ గౌడ్ కు బార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పాత బస్తీ లోని దూద్ బౌలి కి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్.
1983 సంవత్సరంలో పాత బస్తీ దూద్ బౌళి నుంచి భోలక్ పూర్ పద్మశాలి కాలనీకి నివాసం మార్చారు.
గత కొన్ని దశాబ్దాలుగా ఉబ్బసం, దమ్ము వ్యాధులు నయం అయ్యేందుకు చేప మందు ప్రసాదంను ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున నగరంలో పంపిణీ చేస్తూ వస్తున్నారు
దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చేప ప్రసాదం తీసుకునేవారు.
బత్తిని హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు