
యాక్నేతో బాధపడుతున్నారా? యాక్నేని పోగొట్టి కాంతివంతమైన చర్మాన్నిఎండుద్రాక్ష నీళ్లు మీకిస్తాయి. చర్మాన్నిశుభ్రంగా ఉంచుతాయి. మీరు చేయాల్సిందల్లా ఎండుద్రాక్షను రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి ఆ నీళ్లను తాగాలి. ఎండుద్రాక్షను నీళ్లల్లో నానబెట్టడం వల్ల వాటిలోని పోషకాలు నీటిలో బాగా ఇంకుతాయి. ఎంతో గాఢతకలిగిన ఆ నీళ్లను తాగడం వల్ల చర్మంపై ఎంతో ప్రభావం చూస్తాం. ఎందుకంటే ఎండుద్రాక్షలో స్కిన్ లవింగ్ న్యూట్రియంట్లు బోలెడు ఉన్నాయి. ఆ నీళ్లు తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే యాక్నే తీవ్రత నుంచి బయటపడతారని డైటీషియన్లు సైతం అంటున్నారు. ఎండుద్రాక్షలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వాటి నీళ్లను తాగితే మంచి డిటాక్సిఫైయింగ్ డ్రింకుగా కూడా అది పనిచేస్తుంది. యాక్నేకు కారణమైన విషతుల్యమైన మలినాలను ఎండుద్రాక్ష నీళ్లు శరీరం నుంచి బయటకు పంపేస్తాయి. ఎండుద్రాక్షలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా బాగా ఉన్నాయి. ఇవి మండుతున్న చర్మానికి ఎంతో సాంత్వననిస్తాయి. చర్మంలోని ఆయిల్స్ ప్రమాణాలను సైతం ఎండుద్రాక్ష నీళ్లు క్రమబద్ధీకరిస్తాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా యాక్నే బారిన పడతాం. ఎండుద్రాక్షలోని సహజసిద్ధమైన తీపి, హైడ్రేటింగ్ సుగుణాల వల్ల చర్మం మంచి తేమను కలిగి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా 25 గ్రాముల ఎండుద్రాక్షలు తీసుకొని వాటిని మూడు లేదా నాలుగు కప్పుల స్వచ్చమైన నీళ్లల్లో వేసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్న లేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే మీ చర్మం ఎంతో ఆరోగ్యంగా తయారవుతుందని డైటీషియన్లు భరోసా ఇస్తున్నారు కూడా.