
రక్తపోటు సమస్య ఉందా? తరచూ బిపిలో హెచ్చుతగ్గులతో బాధపడుతున్నారా? అయితే మీరు దీన్ని మానిటర్ చేసుకునేటప్పుడు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారపదార్థాలకు బిపి బాధితులు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మనం నిత్యం తినే ఆహారం బిపిపై చూపే ప్రభావం ఎక్కువేనని చెప్తున్నారు.

రోజూ వ్యాయామాలు చేస్తూనే ఉన్నా ఎందుకు బిపి ఎక్కువ ఉంటోందని చాలామంది అనుకుంటారని, కానీ వ్యాయామాలు ఈ సమస్యకు ఎంత అవసరమో అలాగే తినే ఫుడ్స్ విషయంలో ముఖ్యంగా చక్కెర, ఉప్పు వినియోగంలో ఆచితూచి వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్స్ కు దూరంగా ఉండలంటున్నారు. ఆకుకూరలు బాగా తినాలని చెప్పే పెద్దల మాటలు చద్దిమూటలంటున్నారు. చీజ్ బడీ హై మస్త్ మస్త్ నిజమే కానీ అందులో ఉండే ఉప్పు తలచుకుంటే బెదరాల్సిందేనని వైద్యులు తేల్చారు.

బిపి బాధితులు బెర్రీస్ తింటే మంచిదని చెప్తున్నారు. అందులోనూ బ్లూబెర్రీస్ వీరికి చాలా మంచిదంటున్నారు. వీటిల్లో సహజసిద్ధమైన యాంటాక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్స్ వంటి కాంపౌడ్లు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమంటు న్నారు. ఇవి బిపిని తగ్గిస్తాయట. అందుకే నిత్యం డైట్ లో వీటిని తప్పకుండా చేర్చండని సూచిస్తున్నారు. అంతేకాదు స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీలను స్నాక్లా కూడా తినొచ్చని సలహా ఇస్తున్నారు. క్యాండీస్, చాక్లేట్లు కూడా సుదీర్ఘకాలంలో బిపి సమస్యను తెచ్చిపెడతాని, బిపిని బాగా పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఓట్మీల్ పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అని వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఇందులో అధికంగా పీచుపదార్థాలు ఉండడమే ఇందుకు కారణం. అంతేకాదు ఇందులో లోఫ్యాట్, లోసోడియం ఉండడం కూడా మరో కారణం.

ఓట్మీల్ ను నిత్యం తినడం వల్ల రక్తపోటు బాగా తగ్గుతుందని , ఇది సూపర్ ఫుడ్ అని తేల్చారు. పైగా దీన్ని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారని, అందుకే రోజూ ఉదయం ఓట్మీల్ తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. సాఫ్ట్ డ్రింకలో కూడా చక్కెర శాతం అధికంగా ఉండి బిపి బాగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. వారానికి 355 ఎంఎల్ మించి తాగకూడదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్తోంది. అలాగే ఎనర్జీ డ్రింకుల జోలికి కూడా పొవద్దుట. వీటిల్లో షుగర్ తోపాటు కెఫైన్ కూడా ఉంటుందని అవి రెండూ కలిస్తే చెప్పేదేముందని, బిపిని అవి బాగా పెంచుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చేపలు బిపి నియంత్రణకు ఎంతో మంచివి. వీటిల్లో ఒమేగా 3ఉండడమే ఇందుకు కారణమట. సాల్మన్, మెకరల్ వంటి చేపల్లో అధికంగా యాసిడ్స్ ఉంటాయని అవి రక్తపోటును తగ్గిస్తాయని చెప్తున్నారు. అంతేకాదు వీటిల్లో విటమిన్ డి కూడా ఉంది.అలాగే సాస్, మయొనైజ్, కెచప్, సలాడ్ డ్రెస్సింగ్ లకు సైతం దూరంగా ఉండాలిట. కారణం వీటిల్లో సోడియం అధికంగా ఉండి రక్తపోటును బాగా పెంచుతుందిట. వెల్లుల్లి అధికరక్తపోటును బాగా తగ్గిస్తుంది. అందుకే డైట్ లో వెల్లుల్లిని బిపి బాధితులు వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఫ్యాట్, సోడియం ఎక్కువగా ఉండే పిజ్జాల జోలికి వెళ్లొద్దని, వాటిని తినడం వల్ల యుక్తవయసులోనే బిపి బారిన పడడమే కాదు అధికరక్తపోటు సమస్య బాగా వేధిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతెందుకు నార్మల్ పిజ్జాలో సైతం సాల్టీ చీజ్, ఫ్యాటీ బ్రెడ్, సోడియంతో నిండి ఉన్న టొమాటో ప్యూరీ ఉండడాన్ని వైద్యులు గుర్తుచేస్తున్నారు. అయితే డార్క్ చాక్లెట్ మంచిదని చెప్తున్నారు. అది కార్డియోవాస్క్రులర్ జబ్బులను తగ్గిస్తుందని ఒక స్టడీలో తేలిందంటున్నారు. మిల్క్, వైట్ చాక్లెట్లల్లో కన్నా డార్కు చాక్లెట్ లో 60 శాతంపైగా కోకో ఉండి, చాలా తక్కువ షుగర్ ఉంటుందిట. అలాగే ఇన్ స్టాంట్ న్యూడుల్స్ లో సోడియం ఎక్కువగా ఉంటుందని, అది బిపిని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల చాలామంది కాలేజీకి వెడుతున్న యువకుల్లో రక్తపోటు సమస్య ఉండడంపై, గుండెపోటు బాగా రావడంపై వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బిపి బాధితులు ప్రోసెస్డ్ మీట్ కు, రెడ్ మీట్ కి దూరంగా ఉంటే ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికి బదులు చేపలు, చికెన్, టోఫు తినొచ్చని సలహా ఇస్తున్నారు. పిస్తోచీలు రక్తపోటును బాగా తగ్గించడమే కాకుండా హార్ట్ రేట్ ను మెరుగుపరుస్తాయట. ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ కు ఆలివ్ ఆయిల్ వినియోగం మంచిదని పోషకాహారనిపుణులు చెప్తున్నారు. ఇది రక్తపోటును తగ్గిస్తుందిట.

అరటిపండ్లు, దానిమ్మ వంటివి బిపి బాధితులకు మంచిదిట. ఒక కప్పు దానిమ్మ రసం కేవలం నాలుగు వారాల్లో బిపిని తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుందని వైద్యులు చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ తో దానిమ్మ రసం తాగితే ఎంతో మంచిదని సూచిస్తున్నారు. సప్లిమెంట్ల కన్నా బిపి బాధితులు పండ్లు తింటే పొందే మేలు ఎంతోనని వైద్యులు చెప్తున్నారు. ఆల్కహాల్ కు ఆమడదూరంలో ఉండాలంటున్నారు.