SUMMER HEALTH TIPS
Summer Season Health Tips: రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేసవి తాపం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని ఆర్యోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వేసవిలో ఎండ తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం (Dehydration) ప్రధాన సమస్య. దీనివల్ల వడదెబ్బ (Heat Stroke), తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు చర్మంపై దద్దుర్లు, చెమట కాయలు, అజీర్ణం, కలరా వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యలు చెబుతున్నారు.
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
శరీరానికి తగ్గినంత నీరు: దాహం వేయకపోయినా తరచుగా నీటిని తాగుతూ ఉండాలి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందేలా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి.
కాటన్ బట్టలు: వేసవి కాలంలో కాటన్ దుస్తులను ధరించడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా కళ్లద్దాలను వాడాలి.

ఇంట్లో ఉండటం: ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉండటమే శ్రేయస్కరం.
వ్యక్తిగత పరిశుభ్రత: రోజుకు రెండుసార్లు స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చు.
ఆహారం నియమాలు: వేసవిలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి.
ద్రవ పదార్థాలు: పెరుగు, పలచని మజ్జిగ, రాగి అంబలి వంటి చలవ చేసే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
పండ్లు-కూరగాయలు: పుచ్చకాయ, కర్బూజ, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. సొరకాయ, బీరకాయ వంటి నీటి కాయగూరలు మేలు చేస్తాయి.
తేలికపాటి ఆహారం: ఎండల వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువగా తినకుండా, తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తేలికగా అరిగే ఆహారాన్ని అంటే ఇడ్లీ, పెరుగన్నం తీసుకోవాలి.
కూరగాయలు: సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను భోజనంలో చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
వేసవిలో తీసుకోకూడని ఆహారాలు:
- కూల్ డ్రింక్స్: ఫ్రిజ్‌లోని అతి చల్లని నీరు లేదా కృత్రిమ శీతల పానీయాలు (Cool drinks) తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినా అవి ఆరోగ్యానికి హానికరం. మట్టి కుండలో నీటిని తాగడం అత్యుత్తమం.
- వండిన ఆహారం: వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది (Spoil). కాబట్టి ఎప్పటికప్పుడు తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు, రోడ్డు పక్కన విక్రయించే ఆహారానికి దూరంగా ఉండాలి.
- కాఫీ, టీల నియంత్రణ: కెఫీన్ ఉన్న పానీయాలు శరీరంలోని నీటిని బయటకు పంపి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. కాబట్టి వీటికి బదులు నిమ్మరసం లేదా చల్లని పాలు తీసుకోవడం మంచిది.
- మసాలాలు తగ్గించాలి: కారం, మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలకు (Fried foods) దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో వేడిని పెంచి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
గమనిక: మండే ఎండల సమయంలో సరైన ఆహారపు అలవాట్లను పాటిస్తే ఈ వేసవిని ఆరోగ్యంగా గడపవచ్చు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.